రేపు సీఎం రేవంత్ రెడ్డి రాక: పరిగి ఎమ్మెల్యే
పూడూరు మండలం దాంగుండంలో రూ. 3100 కోట్లతో ఏర్పాటు కాబోతున్న నేవీ రాడార్ స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమానికి మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, జిల్లా ఎమ్మెల్యేలు వస్తున్నట్లు DCC అధ్యక్షులు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. దేశ రక్షణలో నేవీ రాడార్ స్టేషన్ కీలక పాత్ర పోషించ బోతుందని పరిగి నియోజకవర్గానికి ఈ ప్రాజెక్టు తలమానికం అని అన్నారు.