పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మేడారం ప్రధానోపాధ్యాయులు అత్తె రాజారాం ఆధ్వర్యంలో జాతీయ బాలికా దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ బాలికలు బాగా చదువుకుని అన్నిరంగాలాలో ముందుకు రావాలనీ, పోషకాహారం, తీసుకోవాలని, ఆడపిల్లలకు 18 సంవత్సారాలు పై బడిన తర్వాతే పెళ్ళిళ్ళు చేయాలని బాల్య వివాహాలు చేయకూడదని తెలిపారు.