రామగుండం: ఆశా వర్కర్స్ కు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలి

74చూసినవారు
రామగుండం: ఆశా వర్కర్స్ కు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలి
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఆశా వర్కర్స్ కు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని సీఐటీయూ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే లకు వినతి పత్రాలు ఇవ్వాలని పిలుపులో భాగంగా
శుక్రవారం రామగుండం అసెంబ్లీ నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మాక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్