రామగుండం: బ్యాంకుల వద్ద భద్రతా ప్రమాణాలు పాటించాలి

55చూసినవారు
రామగుండం: బ్యాంకుల వద్ద భద్రతా ప్రమాణాలు పాటించాలి
బ్యాంకు అధికారులు, సిబ్బంది పోలీస్‌ అధికారులతో సమన్వయంతో పనిచేస్తే నేరాలను నియంత్రించవచ్చని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం సీపీ పోలీసు కార్యాలయంలో కమిషనరేట్ పరిధి పెద్దపల్లి, మంచిర్యాల జోన్ వ్యాప్తంగా ఉన్న ఎసీపీలు వివిధ బ్యాంకుల్లో పని చేస్తున్న బ్యాంకు అధికారులతో, ఏటీఎంల వద్ద భద్రతా ప్రమాణాలు, సీసీ కెమెరాల ఏర్పాటు, ఆర్థిక నేరాలు, తీసుకోవలసిన జాగ్రత్తలపై సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్