న్యాయస్థానాల్లో పెండింగ్‌ కేసులు 5కోట్లకు పైనే: కేంద్రం

70చూసినవారు
న్యాయస్థానాల్లో పెండింగ్‌ కేసులు 5కోట్లకు పైనే: కేంద్రం
దేశంలోని అన్ని న్యాయస్థానాల్లో కలిపి 5 కోట్లకు పైనే కేసులు పెండింగులో ఉన్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ వెల్లడించారు. శుక్రవారం లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలు పేర్కొన్నారు. గరిష్ఠంగా 1.18 కోట్ల కేసులు ఉత్తర్‌ ప్రదేశ్‌లోని సబార్డినేట్‌ కోర్టుల్లోనే ఉండటం గమనార్హం. వీటిలో సుప్రీంకోర్టులో 84,045, వివిధ హైకోర్టుల్లో 60,11,678 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు మంత్రి వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్