ఏపీ ఎన్నికల్లో ప్రజల నాడి అర్థం కావట్లేదు: రాజగోపాల్ రెడ్డి

77చూసినవారు
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని.. ఏపీ ఎన్నికల్లో ప్రజల నాడి అర్థం కావడం లేదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఇవాళ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ ఎన్నికల్లో ప్రజల నాడి సస్పెన్స్‌గా ఉందన్నారు. రెండోసారి వైసీపీకి అధికారం ఇస్తారా? ప్రభుత్వ మార్పు కోరుకుంటున్నారా? అన్న అంశంపై ఉత్కంఠ కొనసాగుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్