వర్షంలో వస్తే కంగనా మేకప్ పోతుంది.. దాంతో ప్రజలు ఆమెను గుర్తుపట్టలేరు: హిమాచల్ మంత్రి జగత్ నేగి

55చూసినవారు
వర్షంలో వస్తే కంగనా మేకప్ పోతుంది.. దాంతో ప్రజలు ఆమెను గుర్తుపట్టలేరు: హిమాచల్ మంత్రి జగత్ నేగి
బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ పై హిమాచల్ ప్రదేశ్ మంత్రి, కాంగ్రెస్ నేత జగత్ నేగి సంచలన వ్యాఖ్యలు చేశారు. వరదలు తగ్గాక కంగనా రాష్ట్రానికి వచ్చారని, వర్షంలో వస్తే మేకప్ పోతుందని ఆమె రాలేదని విమర్శించారు. బహుశా మేకప్ లేకుండా కంగనాను ప్రజలు గుర్తుపట్టలేరని నేగి వ్యాఖ్యానించారు. నేగి వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ "ఆయన విలువలు చూడండి. అసెంబ్లీలో కూడా మహిళలను అవమానిస్తున్నారు" అని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్