పెంపుడు కుక్కను దారుణంగా హింసించాడు (వీడియో)

577చూసినవారు
హర్యానాలోని గురుగ్రామ్‌లో ఇటీవల జరిగిన దారుణ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తన పెంపుడు కుక్క పట్ల అమానవీయంగా ప్రవర్తించాడు. దానిని లిఫ్ట్‌లో కనికరం లేకుండా కొట్టాడు. దాని మూతిని బిగించి, విచక్షణారహితంగా దాడి చేశాడు. ఏమీ చేయలేక ఆ కుక్క మౌనంగా రోదించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కుక్కను కొట్టిన వ్యక్తిని అరెస్ట్ చేయాలని పోలీసులను నెటిజన్లు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్