నీట్‌పై పిటిషన్లు.. జులై 8 నుంచి సుప్రీం విచారణ

81చూసినవారు
నీట్‌పై పిటిషన్లు.. జులై 8 నుంచి సుప్రీం విచారణ
నీట్‌-యూజీ 2024 పరీక్షను రద్దు చేసి మళ్లీ కొత్తగా నిర్వహించాలనే అంశంపై భారత సర్వోన్నత న్యాయస్థానంలో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. మొత్తంగా 26 పిటిషన్లను సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం జులై 8న విచారణ చేపట్టేందుకు సిద్ధమైంది. పరీక్షలో అవకతవకలు, పేపర్‌ లీకేజీ ఆరోపణలు రావడం దేశవ్యాప్తంగా ఆందోళనలకు కారణమైంది. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన సీబీఐ.. బిహార్‌లో ఇప్పటికే పలువురు అనుమానితులను అరెస్టు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్