బొప్పాయిలో పిండినల్లి నివారణ చర్యలు

72చూసినవారు
బొప్పాయిలో పిండినల్లి నివారణ చర్యలు
బొప్పాయి సాగులో చీడపీడల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా పిండినల్లి సమస్య అధికం. నివారణకు.. ఈ పురుగులు చెట్టు మొదళ్ళలో గుడ్లు పెడుతాయి కాబట్టి మొదళ్ళను పారలతో చెక్కి అక్కడ 100-150గ్రా. ఫాలిడాల్ డస్ట్ ను వేయాలి. పిల్ల పురుగులు కాండం నుంచి పైకి పాక కుండా అడుగు ఎత్తులో ప్లాస్టిక్ కవర్ లేదా ఏదైనా పురుగు మందు ద్రావణం రుద్దాలి. లీటరు నీటికి ప్రొఫెనోఫాస్ 2మి.లి లేదా బూప్రోఫెజిన్ లేదా థయోమిథాక్సామ్ 0.25 గ్రా మందులను మారుస్తూ పిచికారి చేసుకోవాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్