AP: తిరుమల శ్రీవారి ఆలయంపై మరోసారి ఓ విమానం చక్కర్లు కొట్టింది. ఆగమశాస్త్రం ప్రకారం శ్రీవారి ఆలయం గోపురంపై నుంచి విమానాలు వెళ్లడం నిషేధం. దీనిపై కేంద్రానికి ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ కేంద్ర విమానయాన శాఖ పట్టించుకోవడం లేదని టీటీడీ తెలిపింది. టీటీడీ ఆలయం పైనుంచి విమానాలు వెళ్లడం అపచారం అని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.