మల్లెలో ముఖ్యంగా మొగ్గ తొలచు పురుగు సమస్య ఎక్కువగా ఉంటుంది. పురుగు యొక్క లార్వా , పువ్వు మొగ్గలోకి చొచ్చుకొని పోయి పూల భాగాలను తినేస్తూ మొగ్గలు ముడుచుకుపోయేలా చేస్తుంది. దీని నివారణకు మలథియాన్ లీటరు నీటికి 2మి.లీ మందును కలిపి చెట్లపై పిచికారీ చేయాలి. నల్లి పురుగు ఉధృతి మల్లెలో అధికంగా ఉంటుంది. పొడివాతావరణలో ఈ పురుగు పంటను ఆశిస్తుంది. దీని నివారణకు గంధపు పొడిని ఎకరానికి 10 కిలోల చొప్పున చల్లుకోవాలి.