అకౌంట్లలోకి పీఎం కిసాన్ డ‌బ్బులు.. నొక్కితే ఖాతా ఖాళీ

83చూసినవారు
అకౌంట్లలోకి పీఎం కిసాన్ డ‌బ్బులు.. నొక్కితే ఖాతా ఖాళీ
పీఎం కిసాన్ ప‌థ‌కంలో భాగంగా ఇటీవ‌ల రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని కేంద్రం విడుద‌ల చేసింది. ఈ క్ర‌మంలో ఖాతాల్లోకి డబ్బులు ప‌డ్డాయా లేదా తెలుసుకోవచ్చని సైబర్‌ నేరగాళ్లు తప్పుడు లింకులు పంపుతున్నారు. ఆ లింకులను నొక్కితే ఖాతాల్లో డబ్బులు మాయమవుతున్నాయి. తెలంగాణ‌(S) కుమురంభీం జిల్లా(D) దహెగాంలో ఆదివారం ఓ వ్యక్తి ఇలాగే వచ్చిన లింకు నొక్కడంతో ఖాతాలోని రూ.98 వేలు మాయ‌మ‌వ్వ‌డం విస్మయానికి గురిచేసింది.

సంబంధిత పోస్ట్