భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోనే తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్‌ను రిమోట్ పద్ధతిలో ప్రారంభించి జాతికి అంకింతం చేశారు. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో రూ.535 కోట్లతో సముద్రంలో 2.08 కిలోమీటర్ల పొడవున దీన్ని నిర్మించారు. మార్చి 2019లో ఈ కొత్త పంబన్ బ్రిడ్జికి ప్రధాని నరేంద్ర మోదీ పునాదిరాయి వేశారు. నాలుగేళ్లలో రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ దీన్ని పూర్తి చేసింది. ఈ బ్రిడ్జి నిర్మాణంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించారు.