వారణాసిలో 14న ప్రధాని మోడీ నామినేషన్

58చూసినవారు
వారణాసిలో 14న ప్రధాని మోడీ నామినేషన్
వారణాసి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రధాని మోడీ మరోసారి పోటీ చేయనున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 14న అక్కడ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు. అంతకు ముందు 13వ తేదీన వారణాసిలో ప్రధాని మోడీ భారీ రోడ్ షో నిర్వహించనున్నారు. 2014, 2019 ఎన్నికల్లో మోడీ వారణాసి నుంచి వరుసగా గెలిచారు. ప్రస్తుతం ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ పోటీ చేయనున్నారు.

సంబంధిత పోస్ట్