ప్రధాని మోడీ ఇటీవల పోలాండ్ వెళ్లి భారత్‌కు తిరుగు వస్తున్న ప్రత్యేక విమానం 46 నిమిషాలు పాక్ గగనతలాన్ని వినియోగించుకుందని అక్కడి మీడియాలో కథనాలు వెల్లడించాయి. రాత్రి 11:00 గంటలకు చిత్రాల్ మీదుగా పాక్‌లోకి ప్రవేశించి, ఇస్లామాబాద్-లాహోర్‌లోని ఎయిర్ కంట్రోల్ ప్రాంతాలను వినియోగించినట్లు తెలుస్తోంది. తిరిగి అమృత్సర్ మీదుగా 11:46 గంటలకు భారత గగనతలంలోకి ప్రవేశించిందని తెలిపింది.