బీజేపీపై నమ్మకం ఉంచిన ఢిల్లీ ప్రజలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీని వికసిత్ రాజధానిగా మార్చే అవకాశాన్ని ఇక్కడి ప్రజలు బీజేపీకి ఇచ్చారని అన్నారు. ‘ఆప్ నుంచి విముక్తి లభించిందని ఢిల్లీ ప్రజలు సంతోషంగా ఉన్నారు. మోదీ గ్యారంటీని ఇక్కడి ప్రజలు విశ్వసించారు. వారు చూపించిన ప్రేమను అనేక రెట్లు పెంచి అభివృద్ధి రూపంలో తిరిగిస్తాం. ఢిల్లీని అభివృద్ధి చేసి ఇక్కడి ప్రజల రుణం తీర్చుకుంటాం. ఢిల్లీలో అసలైన విజేతలు.. ప్రజలే’ అని వ్యాఖ్యానించారు.