ఫిర్యాదు చేయడానికి వెళ్లిన బాధితుడిని కొట్టిన పోలీస్ (వీడియో)

71చూసినవారు
ఫిర్యాదు చేయడానికి వెళ్లిన ఓ బాధితుడి పట్ల పోలీస్ కానిస్టేబుల్ దురుసుగా ప్రవర్తించాడు. ఈ ఘటన తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో చోటుచేసుకుంది. ఓ కేసు విషయమై తథియా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి ఓ వ్యక్తి వెళ్లాడు. అయితే, అక్కడ ఓ కానిస్టేబుల్ బాధితుడి పట్ల అనూహ్యంగా ప్రవర్తించాడు. బాధితుడి చెంపమీద కొట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్