AP: సెకండరీ హెల్త్ ఆస్పత్రుల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్/ జనరల్ పోస్టులకు రేపటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 31 వరకు అవకాశం కల్పిస్తూ ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నిర్ణయించింది. గత నెలలో 97 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రాగా, మరో 200 పోస్టులను కలిపిన నేపథ్యంలో కొత్తగా దరఖాస్తులకు అవకాశం కల్పించారు.