AP: తిరుపతిలో తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు మృతిచెందడంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై అమర్నాథ్ తీవ్ర విమర్శలు చేశారు. తిరుపతి తొక్కిసలాట ఘటన బాధకరమని అన్నారు. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి.. ఎక్స్‌గ్రేషియో కోటి రూపాయలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. లడ్డూని రాజకీయం చేశారు.. అందుకే ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయని భక్తులు భావిస్తున్నారని అన్నారు.