అంతర్జాతీయ టీ20ల్లో వెస్టిండీస్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నికోలస్ పూరన్(1904) నిలిచారు. టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచులో ఆయన ఈ ఘనతను సాధించారు. ఇప్పటివరకు ఈ రికార్డు మాజీ క్రికెటర్ క్రిస్ గేల్(1899) పేరిట ఉండేది. వీరిద్దరి తర్వాతి స్థానాల్లో వరుసగా శామ్యూల్స్(1611), కీరన్ పొలార్డ్(1569), సిమ్మన్స్(1527) ఉన్నారు.