దేశీయ మార్కెట్లోకి పోర్షే సరికొత్త కారు.. ధర 1.69 కోట్లు

58చూసినవారు
దేశీయ మార్కెట్లోకి పోర్షే సరికొత్త కారు.. ధర 1.69 కోట్లు
స్పోర్ట్స్‌ లగ్జరీ కార్ల తయారీ సంస్థ పోర్షే.. దేశీయ మార్కెట్‌లో మరో మోడల్‌ను విడుదల చేసింది. థర్డ్‌ జనరేషన్‌ పనమెరా మోడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కారు ధర రూ.1,69,62,000(కోల్‌కతా షోరూంలో ధర). జర్మనీ నుంచి దిగుమతి చేసుకొని భారత్‌లో విక్రయిస్తుండటంతో ధర అధికంగా ఉన్నదని పోర్షే ఇండియా బ్రాండ్‌ డైరెక్టర్‌ మనోలిటో వ్యూజిసిస్‌ తెలిపారు. దిగుమతి సుంకాలు పెరగటంతో ఈ భారం కొనుగోలుదారులపై మోపాల్సి వస్తున్నదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్