ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ అనే మూవీ తెరకెక్కబోతుంది. ఈ చిత్రంలో ప్రభాస్ ఒక సైనికుడి పాత్ర పోషిస్తున్నారట. ఇది ఇండియన్ మిలటరీకి సంబంధించిన దేశభక్తి కథ అని తెలుస్తోంది. ఇందులో పాకిస్తాన్ హీరోయిన్ సాజల్ కథానాయికగా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 22న లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.