ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి రెచ్చిపోయి మాట్లాడారు. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఫుట్‌బాల్ లాంటి వారని, ఆయనను ఎవరైనా ఉపయోగించుకుంటారని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. పవన్ చెబుతున్నట్లు సనాతన ధర్మం, హిందూ మతం ప్రమాదంలో లేవని, బీజేపీ మాత్రమే ఇబ్బందుల్లో ఉందన్నారు. నటుడు వివిధ చిత్రాల్లో వేర్వేరు పాత్రల్లో పోషిస్తారని, రాజకీయాలు అలా కాదని పవన్ తెలుసుకోవాలని హితువు పలికారు.