నడిరోడ్డుపై ప్రీ వెడ్డింగ్ షూట్.. వీడియో వైరల్

79చూసినవారు
ప్రస్తుతం ఫొటో షూట్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ ట్రెండ్ నడుస్తోంది. ఇందుకోసం వింత వింత ప్రయోగాలు కూడా చేస్తున్నారు. తాజాగా ఓ అమ్మాయి వైజాగ్‌లో నడిరోడ్డుపై పెళ్లి కూతురు గెటప్‌లో ముస్తాబై ఫొటో షూట్ చేయించుకుంది. ఈ వీడియోను ప్రతీక్ సింగ్ అనే ఎక్స్ యూజర్ షేర్ చేయగా, వైరల్‌గా మారింది. దీనికి బిజీగా ఉన్న రోడ్డులో ప్రీ వెడ్డింగ్ షూటింగ్ అవసరమా అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. వీడియో చూసిన నెటిజన్లు ఇలాంటి చర్యలపై యాక్షన్ తీసుకోవాలంటూ కామెంట్లు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్