వర్షాకాలంలో రోగాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

68చూసినవారు
వర్షాకాలంలో రోగాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
భోజనానికి ముందు తప్పనిసరిగా చేతులను శుభ్రం చేసుకోవాలి. కూరగాయలను వండే ముందు, పండ్లను తినే ముందు తప్పనిసరిగా నీటితో శుభ్రం చేయాలి. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉంటే దోమలు వృద్ధి చెందే అవకాశం ఉంది. మలేరియా, డెంగీ వంటి జ్వరాలు దోమల వల్ల వస్తాయి. అందుకే దోమల నిర్మూలనకు మందులు, దోమ తెరలను వాడాలి. వర్షాకాలంలో బయటకు వెళ్లి వచ్చిన తర్వాత కాళ్లు కడుక్కునే ఇంట్లోకి రావాలి. హెర్బల్‌ టీ, వెచ్చని పానీయాలు తీసుకోవాలి. బయట జంక్‌ ఫుడ్స్‌ తినకపోవడం మంచిది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్