డిబేట్‌కి సిద్ధం: రాహుల్ గాంధీ

74చూసినవారు
డిబేట్‌కి సిద్ధం: రాహుల్ గాంధీ
ప్రధాని నరేంద్ర మోదీతో ఓపెన్ డిబేట్‌లో పాల్గొనడానికి తాను సిద్ధమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఈ మేరకు మాజీ న్యాయమూర్తులు మదన్ బి.లోకూర్, అజిత్.పి.షా, సీనియర్ జర్నలిస్ట్ ఎన్.రామ్ రాసిన లేఖపై రాహుల్‌ స్పందించారు. ఆ చారిత్రాత్మక చర్చలో పాల్గొనేందుకు తాను ఆత్రుతగా ఎదురు చూస్తున్నానని వెల్లడించారు. ఈ డిబేట్‌లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ అంగీకారం తెలిపితే నిర్వాహకులు తనకు వెంటనే తెలియజేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్