గత ప్రభుత్వం రుణమాఫీ చేయకుండా మోసం చేసింది: ఉత్తమ్‌

57చూసినవారు
గత ప్రభుత్వం రుణమాఫీ చేయకుండా మోసం చేసింది: ఉత్తమ్‌
గత ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేయకుండా మోసం చేసిందని మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి విమర్శించారు. తొలి ఐదేళ్లలో గత BRS ప్రభుత్వం కేవలం రుణమాఫీ కింద వడ్డీ చెల్లించారని చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో రూ.18 వేల కోట్లు రుణమాఫీ చేశామని తెలిపారు. ఈ వర్షాకాలంలో దేశంలోనే అధిక వరి పండించిన ఘనత తెలంగాణదే అని కొనియాడారు. ఉమ్మడి ఏపీలోనూ ఇంత మొత్తంలో వరి దిగుబడి రాలేదని చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్