మాజీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్ సోమవారం పూజారి గ్రంథి సమ్మాన్ యోజన పథకాన్ని ప్రకటించారు. నెలకు రూ.18,000 ఇస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ఈ పథకం కింద దేవాలయాల పూజారులు, గురుద్వారాలోని ‘గ్రంథి’లకు నెలకు రూ.18,000 గౌరవ వేతనం అందజేస్తామని కేజ్రీవాల్ తెలిపారు. వచ్చే ఢిల్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే ‘పూజారీ గ్రంథి సమ్మాన్ యోజన’ను ప్రారంభిస్తామని కేజ్రీవాల్ పేర్కొన్నారు.