విశ్వాస ప‌రీక్ష‌లో నెగ్గిన నేపాల్ ప్రధాని

70చూసినవారు
విశ్వాస ప‌రీక్ష‌లో నెగ్గిన నేపాల్ ప్రధాని
నేపాల్ ప్ర‌ధాని పుష్ప క‌మాల్ ద‌హ‌ల్ ప్ర‌చండ ఇవాళ పార్ల‌మెంట్‌లో జ‌రిగిన విశ్వాస ప‌రీక్ష‌లో నెగ్గారు. హౌజ్ ఆఫ్ రిప్ర‌జెంటేటివ్స్ నుంచి ఆయ‌న బ‌ల‌ప‌రీక్ష‌లో పాల్గొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 100 క్లాజ్ 2 ప్ర‌కారం 69 ఏళ్ల ప్ర‌ధాని విశ్వాస ప‌రీక్ష‌లో పాల్గొన్నారు. కూట‌మి స‌ర్కారు నుంచి జ‌న‌తా స‌మాజ్‌బాదీ పార్టీ వైదొల‌గ‌డంతో ప్ర‌చండ విశ్వాస ప‌రీక్ష‌కు నిలిచారు. కాగా గ‌త ఏడాదిన్న‌రలో ఆయన బ‌ల‌ప‌రీక్ష‌లో పాల్గొన‌డం ఇది నాలుగోసారి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్