బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఇవాళ ముంబైలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఐదో విడతలో తన తాను నివాసం ఉంటున్న ప్రాంతంలో ఓటు వేశారు. ఇదిలా ఉంటే అక్షయ్ కుమార్ బాలీవుడ్ స్టార్ హీరో అయినప్పటికీ.. అతను 2023 ఆగస్టు నెల వరకు కెనడా పౌరసత్వం కలిగి ఉన్నారు. ఆగస్టులో అతనికి భారత ప్రభుత్వం భారతీయ పౌరసత్వాన్ని అధికారికంగా అందించింది. దీంతో ఆయన దేశంలో తొలిసారి ఓటు హక్కును వినియోగించుకున్నారు.