తెలంగాణలో పత్తి రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట కలెక్టరేట్ ఆఫీస్ లో గురువారం గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను మర్యాదపూర్వకంగా కలిసి పత్తి రైతుల సమస్యలపై రిప్రజెంటేషన్ అందజేశారు. ఈ సందర్భంగా జగదీశ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పత్తి రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని కోరారు.