SC, ST రిజర్వేషన్ల వర్గీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన భారత్ బంద్‌లో షాకింగ్ ఘటన జరిగింది. బీహార్‌లోని గోపాల్‌గంజ్ నగరం అరార్ మోర్ ప్రాంతంలో స్కూల్ బస్సుకు ఆందోళనకారులు బుధవారం నిప్పు పెట్టారు. ఆ సమయంలో బస్సు నిండా పిల్లలు ఉన్నారు. పోలీసులు స్పందించి పిల్లలను బస్సు నుంచి కిందకు దింపారు. దీంతో వారికి ప్రాణాపాయం తప్పింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆందోళనకారుల తీరుపై విమర్శలొస్తున్నాయి.