AP: PSLV-C59 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని కోరుతూ ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ ఇవాళ పూజలు నిర్వహించారు. సూళ్లూరుపేటలోని చెంగాలమ్మ పరమేశ్వరి దేవీ ఆలయాన్ని సందర్శించారు. రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ59 రాకెట్ ద్వారా ఈ ప్రయోగం జరగనుంది. వాతావరణం అనుకూలిస్తే బుధవారం సాయంత్రం 4.08 గంటలకు ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.