AP: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వీరికి అటెండెన్స్ యాప్ అందుబాటులో ఉండగా.. ఉద్యోగులు డ్యూటీలో వచ్చినప్పుడు, వెళ్లినప్పుడు బయోమెట్రిక్ హాజరు వేయాల్సి ఉంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా 15 వేల మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు వరుసగా 13 రోజులు బయోమెట్రిక్ వేయలేదని ప్రభుత్వం గుర్తించింది. దాంతో వారందరికీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. తప్పనిసరిగా బయోమెట్రిక్ వేయాలని ఆదేశించింది.