AP: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడెకల్ గ్రామంలో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నాకు దిగింది. అజయ్ అనే యువకుడు తనను ప్రేమించి పెళ్లి చేసుకొని మోసం చేశాడని యువతి ప్రమీల ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని ప్రమీల డిమాండ్ చేశారు. ఇంటి ముందు యువతి ధర్నాకు దిగడంతో అజయ్ కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు.