ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప-2 విడుదల మరోసారి వాయిదా పడనుందనే రూమర్స్‌కు మేకర్స్ చెక్ పెట్టారు. ప్రస్తుతం ఈ మూవీ అద్భుతమైన క్లైమాక్స్ సీన్స్ షూటింగ్ జరుగుతోందని ట్వీట్ చేశారు. డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల అవుతుందని స్పష్టంచేశారు. దీంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.