పశ్చిమ దేశాలకు పుతిన్ వార్నింగ్

51చూసినవారు
పశ్చిమ దేశాలకు పుతిన్ వార్నింగ్
ఉక్రెయిన్‌కు మద్దతుగా అమెరికా సైన్యాన్ని పంపితే అణుయుద్ధం తప్పదని రష్యా అధ్యక్షుడు పుతిన్ పశ్చిమ దేశాలను హెచ్చరించారు. మార్చి 15-17 మధ్య రష్యా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బుధవారం ఆయన స్థానిక మీడియాతో మాట్లాడారు. అకారణంగా ఉక్రెయిన్‌పై అణ్వాయుధాలు ప్రయోగించాల్సిన అవసరం రష్యాకు లేదని, ఒకవేళ అమెరికా సైన్యం యుద్ధంలో జోక్యం చేసుకుంటే దానికి తప్పకుండా బదులిస్తామని పుతిన్ స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్