బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఆన్‌డ్యూటీ సౌకర్యాన్ని ఏపీ ప్రభుత్వం మరో ఏడాది పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉన్న ఆమె హైదరాబాద్‌లోని ఏపీ ఆధీనంలో ఉన్న లేక్ వ్యూ అతిథి గృహం ఓఎస్డీగా పని చేస్తున్నారు. అయితే పీవీ సింధు ఆన్‌డ్యూటీ సర్వీస్‌ను 2025 సెప్టెంబర్ 30 వరకూ పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతర్జాతీయ పోటీల్లో శిక్షణ తీసుకుంటున్నందు వల్ల ఆమెకు ఓడీ సౌకర్యం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.