ఇవాళ వయనాడ్‌లో రాహుల్, ప్రియాంక పర్యటన

62చూసినవారు
ఇవాళ వయనాడ్‌లో రాహుల్, ప్రియాంక పర్యటన
కేరళలోని వయనాడ్‌లో ఇవాళ కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పర్యటించనున్నారు. కొండచరియలు విరిగిపడి నష్టపోయిన బాధితుల కుటుంబాలను పరామర్శించనున్నారు. మెప్పాడిలోని ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాలలో ఏర్పాటుచేసిన రిలీఫ్ క్యాంపునకు వెళ్తారు. అలాగే సెయింట్ జోసెఫ్ యూపీ స్కూల్‌లోని రిలీఫ్ క్యాంప్, డాక్టర్ మూపెన్స్ మెడికల్ కాలేజ్‌లో ఏర్పాటుచేసిన క్యాంపులోని బాధితులను పరామర్శిస్తారు.

సంబంధిత పోస్ట్