భారీ వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా, మండి, కులు ప్రాంతాల్లో ప్రాణనష్టం జరగడం బాధాకరమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అక్కడి పరిస్థితిపై ఆ రాష్ట్ర సీఎం సుఖ్వీందర్ సింగ్ సుక్కును అడిగి తెలుసుకున్నామన్నారు. తానే స్వయంగా అక్కడికి వెళ్లి సహాయక చర్యలను సమీక్షిస్తామని సీఎం చెప్పారని పేర్కొన్నారు.