లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ మిల్క్‌షేకులు, పాలఉత్పత్తుల సంస్థ కెవెంటర్స్ షాప్‌లోకి ప్రవేశించి తన స్వహస్తాలతో ‘కోల్డ్ కాఫీ’ తయారుచేసి అందరినీ ఆకట్టుకున్నారు. తమ షాపుకు విచ్చేసిన రాహుల్ గాంధీకి కోల్డ్ కాఫీ ఎలా చేస్తారో కెవెంటర్స్ సంస్థ సిబ్బంది చూపే ప్రయత్నం చేయగా రాహుల్ ‘లేదు లేదు నేను చేసి చూపుతా’ అంటూ రంగంలోకి దిగారు. అనంతరం ఆయన ఆ షాపు యాజమాన్యంతో ముచ్చటించారు.