హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం!

65చూసినవారు
హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం!
హైదరాబాద్‌లో ఆదివారం సాయంత్రం పలు చోట్ల భారీ వర్షం కురిసింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి, హైదర్‌నగర్‌, నిజాంపేట్‌, ప్రగతినగర్‌, బోరబండ, యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్‌, అమీర్‌పేట, పంజాగుట్ట, రామంతాపూర్‌, ఉప్పల్‌, బేగంపేట్‌, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌, హయత్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

సంబంధిత పోస్ట్