తోటి విద్యార్థిని కత్తితో పొడిచిన 9వ తరగతి స్టూడెంట్

53చూసినవారు
తోటి విద్యార్థిని కత్తితో పొడిచిన 9వ తరగతి స్టూడెంట్
ఒడిశాలోని గంజాం జిల్లాలో దారుణ సంఘటన జరిగింది. శుక్రవారం ఉదయం రాంచంద్రాపూర్‌లోని రఘునాథ్ హైస్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో తోటి విద్యార్థిని ఒక స్టూడెంట్‌ కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన ఆ విద్యార్థిని ఎంకేసీజీ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కత్తితో పొడిచిన 14 ఏళ్ల స్టూడెంట్‌ను అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్