T-20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా ప్లేయర్ల హవా కొనసాగుతోంది. ICC విడుదల చేసిన ర్యాంకింగ్‌లలో టాప్-10 బౌలర్లలో ముగ్గురు టీమిండియా ప్లేయర్లు ఉన్నారు. బౌలింగ్ విభాగంలో వెస్టిండీస్ అకీల్ హోసెన్(707) అగ్రస్థానంలో ఉండగా వరుణ్ చక్రవర్తి(706) రెండో ర్యాంకును దక్కించుకున్నారు. ఆరో స్థానంలో రవి బిష్ణోయ్(674), అర్షదీప్ సింగ్(653) 9వ ర్యాంకును దక్కించుకున్నారు. ఆల్‌రౌండ్ విభాగంలో హార్దిక్ పాండ్య(252) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.