అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

83చూసినవారు
అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త
AP:  శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలో దారుణం చోటు చేసుకుంది. అనుమానంతో భార్యను హత్య చేశాడు ఓ భర్త. సంతసీతారాంపురానికి చెందిన గాలి అప్పలరెడ్డి తన భార్యకు అక్రమ సంబంధం ఉందని అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో గొడవకు దిగి ఆమెపై కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కుమారుడు త్రినాథరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్