వానా కాలంలో సీజనల్ వ్యాధులపై జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా రోగాలబారిన పడక తప్పదు. దోమలు, ఈగలు వ్యాప్తి చెందకుండా చూడాలి. మెదడువాపు, చికున్‌గున్యా, డెంగీ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి. కలరా, టైఫాయిడ్, లెప్టోస్పిరోసిస్ వంటి నీటి ద్వారా వచ్చే వ్యాధులు ఉన్నాయి.