ప్రతి కళాశాలలో యాంటీ ర్యాగింగ్ సెల్ ఏర్పాటు చేయాలి. బాధితులు ఫిర్యాదు చేయడానికి వీలుగా ఫిర్యాదు పెట్టె, ఫోన్ నంబరు, ఈమెయిల్ అడ్రస్ వంటివి అందుబాటులో ఉంచాలి. ర్యాగింగ్‌కు పాల్పడితే శిక్షకు గురవుతారనే బోర్డులను కళాశాల ఆవరణలో ప్రదర్శించాలి. స్థానిక పోలీసు అధికారుల మొబైల్ నంబర్లను ప్రదర్శించాలి. ర్యాగింగ్ బారినపడిన విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి, ఆందోళనలను తగ్గించేందుకు సైకియాట్రీ సేవలు కల్పించాలి.