సైకిల్ మెకానిక్ నుంచి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారు!

63చూసినవారు
సైకిల్ మెకానిక్ నుంచి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారు!
మధ్యప్రదేశ్ కి చెందిన వీరేంద్ర కుమార్ ఖటీక్ సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. చిన్నతనంలో తండ్రి సైకిల్ రిపేర్ షాపులో ఆయన పంక్చర్లు వేసేవారు. దళిత వర్గానికి చెందిన వీరేంద్ర గ్రాడ్యుయేషన్, బాల కార్మికులపై PhD చేశారు. 1996లో తొలిసారిగా LS ఎన్నికల్లో గెలిచిన వీరేంద్ర మళ్లీ వెనుదిరిగి చూడలేదు. తాను సాధారణ కుటుంబ వ్యక్తినని, తన జీవనశైలి ఇప్పటికీ సాధారణంగా ఉంటుందని అంటున్నారు.

సంబంధిత పోస్ట్