ముంబైలో జరుగుతున్న అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లికి అతిరథ మహారథులు హాజరవుతున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కుటుంబ సభ్యులతో కలిసి వేడుకకు వచ్చారు. ఈ సందర్భంగా వేదిక వద్ద పెళ్లి కొడుకుతో కలిసి రజనీకాంత్ డాన్స్ చేశారు. ఆయనతో పాటు బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ మాస్ స్టెప్పులు వేశారు. మరోవైపు మహేష్ బాబు, నమ్రత, సితార హాజరయ్యారు.